KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఇవాళ ఛైర్పర్సన్ సామినేని సుజాత శంకుస్థాపన చేశారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.