WGL: నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్థానిక మహిళలు కలిశారు. ముచింపుల నుంచి రంగాపురం మీదుగా, ఎండి గౌస్పల్లె మీదుగా హనుమకొండ రూట్లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ప్రజల రవాణా ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.