వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ వాజ్ పాయ్పై కాంగ్రెస్ MLC సారయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సమావేశాలకు తమకు అధికారికంగా సమాచారం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మున్సిపల్ చీఫ్ సెక్రటరీతో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు లేఖను అందించారు.