Kangana Ranaut: Aadhaar card should be brought along.. Congress strongly objected
Kangana Ranaut: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనారనౌత్ ఎప్పుడూ ఏదో విషయంపై వివాదస్పదమై వైరల్ అవుతుంటారు. అయితే ఎంపీగా ఉన్న కంగనా డిమాండ్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. తనని కలిసేందుకు వచ్చిన వాళ్లు వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని ఆమె చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరం తెలిపింది. తనని కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. అలాగే ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని కూడా పేపర్‌పై రాసివ్వాలి. దీనివల్ల ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆమె తెలిపారు.
రాష్ట్రంలోని ఉత్తరప్రాంత ప్రజలు తనతో మీట్ అయ్యేందుకు మనాలిలోని తన ఇంటికి కూడా రావచ్చని తెలిపారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్యసింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంపీని కలవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజల్ని కలవాల్సిన బాధ్యత మనకుందని తెలిపారు. పని ఉంటేనే కదా కలిసేందుకు వస్తారు. ఇలా ఆధార్ కార్డు తెచ్చుకోమని ప్రజలను అడగడం కరెక్ట్ కాదని తప్పుపట్టారు.