sweets : భోజనంలో స్వీట్స్ లేవని గొడవ.. పెళ్లి రద్దు!
చినికి చినికి గాలివాన అయినట్లు భోజనంలో స్వీట్లు పెట్టలేదని మొదలైన గొడవ కాస్తా పెళ్లి రద్దు వరకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
రకరకాల వింత కారణాలతో పెళ్లిళ్లు రద్దు అవుతున్న ఘటనలను ఈ మధ్య కాలంలో వింటూ ఉంటున్నాం. కర్ణాటకలో ఇలాంటి వింత ఘటన ఒకటి వెలుగుచూసింది. భోజనంలో స్వీట్లు లేవన్న కారణంగా వధువు తరఫు వారు మనస్తాపానికి గురయ్యారు. అంతకు ముందు జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన వధువు(BRIDE ) తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పోలీస్ స్టేషన్కి చేరింది. నిశ్చితార్థం ఉంగరాన్ని వారికి ఇచ్చేసి పెళ్లి రద్దు చేయమని కోరింది. దీంతో ఆ పెళ్లి రద్దైంది.
కర్ణాటక రాష్ట్రంలోని హనగల్ గ్రామానికి చెందిన యువతికి అక్కడి తమకూరుకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అయ్యింది. మే 5వ తారీఖున వీరి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి జరగడానికి ముందు రోజు వరుడి తరఫు వారు వధువు(BRIDE) తరఫు వారిని కట్నం డిమాండ్ చేశారు. బంగారం, బెంగళూరులో భూమి కావాలని అడగడం మొదలు పెట్టారు.
ఈ గొడవ మధ్యనే పెళ్లి రోజు రానే వచ్చింది. అంతకు ముందు జరిగిన గొడవల కారణంగా వరుడి తరఫు వారు భోజనంలో స్వీట్లు(sweets) పెట్టలేదని తెలిసింది. దీంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పి ఉంగరాన్ని తీసి పోలీసులకు ఇచ్చింది. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇలాగే బిరియానీ సరిపోలేదని, మటన్ బోన్స్ పెట్టలేదని, ఐస్క్రీం అయిపోయిందని పెళ్లిళ్లు రద్దైన సంఘటనలూ చోటు చేసుకున్నాయి.