What is the salary of MPs? What are their additional facilities?
Lok Sabha Elections: పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికైన వ్యక్తులకు దేశ ప్రభుత్వం చాలా సౌకర్యాలు కల్పిస్తుంది. వీటితో పాటు ఎంపీల జీతం కూడా లక్షల్లో ఉంటుంది. మరి అవెంటో చూద్దాం. ఎంపీగా ఎన్నికైన వ్యక్తులు 5 సంవత్సరాలు పాటు పదవిలో ఉంటారు. నెలకు రూ. లక్ష వేతనంగా అందుతుంది. పదవి అనంతరం రూ. 50 వేల పింఛన్ అందుతుంది. వీటితో పాటు ఎంపీలకు అదనపు సౌకర్యాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఎంపీతో పాటు, ఎంపీ భాగస్వామికి సంవత్సరంలో 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు.
ఫస్ట్‌క్లాస్ ఏసీ కోచ్‌లో రైలు ప్రయాణం ఉచితం.
నియోజకవర్గంలోని ఆఫీస్ ఖర్చు నెలకు రూ.45 వేలు అందుతుంది.
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి రోజుకు రూ.2 వేలు చెల్లిస్తారు.
ఇంటి వసతులు, ఫర్నిచర్, ఎలక్టాన్రిక్ వస్తువులు కోసం ప్రతి మూడు నెలలకు రూ.75 వేలు అందుతాయి.
ఆసుపత్రి సేవలు ఉచితంగా పొందవచ్చు. అందులో పాథాలాజికల్ లాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, ఈఎన్టీ సేవలు ఉచితంగా పొందవచ్చు. ఢిల్లీలో నివాసం కల్పిస్తారు. 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్తు.
50 వేల ఉచిత టెలిఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. మూడు కనెక్షన్లు.
రోజుకు 3జీబీ ప్యాకేజీతో 1.50 లక్షల స్మార్ట్ ఫోన్ కాల్స్ అదనంగా పొందవచ్చు.