»Narendra Modi Zindabad Slogans In Parliament Video Viral
Atul Garg: పార్లమెంట్లో నరేంద్ర మోడీ జిందాబాద్ నినాదాలు.. వీడియో వైరల్
పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ జిందాబాద్ అని నినాదం చేసినందుకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Narendra Modi Zindabad slogans in Parliament.. Video viral
Atul Garg: పార్లమెంట్లో రెండు రోజులుగు ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ లోక్ సభ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో కాస్త హడావిడీ ఏర్పడింది. మంగళవారం బీజేపీ ఎంపీ (BJP MP) అతుల్ గార్గ్ (Atul Garg) ప్రమాణస్వీకారం అయిన తరువాత స్లోగన్స్ ఇచ్చారు. వీటిపై సభలో ఉన్న విపక్షనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే ఎంపీ అతుల్ గార్గ్ వారి అభ్యంతరాన్ని లెక్కచేయకుండా మళ్లీ స్లోగన్ ఇచ్చారు.
ప్రమాణస్వీకారం చేసిన అతుల్ గార్గ్ శ్యామ ప్రసాద్ ముఖర్జి జిందాబాద్, దీన్దయాల్ ఉపాధ్యాయ జిందాబాద్, అటల్ బిహారీ వాజ్పేయి జిందాబాద్, నరేంద్రమోదీ జిందాబాద్ అని స్లోగన్ చేశారు. దీనిపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్ సభ అంత కాసేపు గోలగా మారింది. దాంతో తన సీటు దగ్గరకు వస్తున్న గార్గ్ మళ్లీ వెనక్కి వెళ్లి మైక్ పట్టుకొని డాక్టర్ హెడ్గెవార్ జిందాబాద్ అని నినదించాడు.
ఈ హెడ్గెవార్ అనే వ్యక్తి డాక్టర్ హెడ్గెవార్గా ప్రసిద్ది. ఆయనే ఆరెస్సెస్ను స్థాపించారు. ఈయన తరువాత ఏఎమ్ఐఎమ్ పార్టీ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సైతం ప్రమాణ స్వీకారం అయిపోయిన తరువాత జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినదించారు. దీనిపై కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.