ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన మణిపుర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ విపక్షాలపై మండిపడ్డారు.
PM Modi: ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన మణిపుర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయవద్దంటూ విపక్షాలకు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ ఈరోజు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మణిపుర్ అంశాన్ని ప్రస్తావించారు.
మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు అక్కడ జరిగిన అల్లర్లుపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇప్పుడే ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గాయి. కేంద్ర మంత్రి కొన్ని వారాల పాటు అక్కడే ఉన్నారు. వరదలు తలెత్తగా సహాయం కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని మోదీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మణిపుర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని విపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. మణిపుర్ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలన్నారు.