PM MODI : ప్రపంచంలోనే అత్యధిక ఎక్స్ ఫాలోవర్లు ఉన్న నేతగా మోదీ రికార్డు
ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిలో ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన నాయకుడిగా మన ప్రధాని నరేంద్ మోదీ రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
MOST FOLLOWED POLITICIAN ON X : ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిలో ప్రధాని నరేంద్ర మోదీకే ఎక్స్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఎక్స్ ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు పది కోట్లు దాటింది. గతంలోనే ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించారు మోదీ. అయితే ఇప్పుడు పది కోట్ల మంది ఫాలోవర్లతో ఆయన రికార్డును ఆయనే బద్ధలుగొట్టుకున్నారు. మోదీ ఎప్పుడూ ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఏ విషయాన్ని ప్రకటించాలన్నా ఆయన అందుకు దీన్నే వేదికగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఫాలోవర్లు నానాటికీ పెరుగుతూ వచ్చారు.
ఫాలోవర్ల విషయంలో పది కోట్ల మందితో మోదీ అగ్ర స్థానంలో ఉన్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు 3.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మహ్మద్‌కు 1.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. పోప్ ప్రాన్సిస్‌కు 1.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరంతా మోదీ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఇక మన దేశంలోని ఇండియా కూటమిలో ప్రముఖ నేతలైన రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖ నేతలందరి ఫాలోవర్లను కలిపినా కూడా మోదీని బీట్ చేయలేకపోయారు.
ఇక ప్రపంచంలోని గుర్తింపు పొందిన ఇతర ప్రముఖుల్లో లెక్క వేసుకున్నా కూడా మోదీ టాప్‌లోనే ఉన్నారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఎక్స్‌లో 6.4కోట్ల మంది, టైలర్ స్విఫ్ట్‌కు 9.5కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరి కంటే కూడా మోదీయే టాప్‌లోనే ఉన్నారు. ఈ విషయపై మోదీ తన ఎక్స్ ఖాతాలో సైతం ట్వీట్ చేశారు. ఇంత వైబ్రెంట్ మీడియంలో తనకు వంద మిలియన్ ఫాలోవర్లు రావడంపై ఆనందంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు.