మయన్మార్ ప్రజలు సైన్యం పాలనలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది.
Myanmar: మయన్మార్ ప్రజలు సైన్యం పాలనలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కనీసం పదిమంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక వాళ్ల వ్యాపారాలను కూడా బలవంతంగా మూసివేయించింది.
మయన్మార్‌లో వేతనాల పెంపు చట్ట విరుద్ధం కాదు. కానీ ద్రవ్యోల్బణ ఆందోళనల వేళ ఇలా జీతాలు పెంచడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోందట. ఈ విషయాన్ని ఆయా దుకాణాల ముందు అంటించిన నోటీసుల్లో పేర్కొంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021లో సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశంలో మిలటరీ పాలనలో ఉండగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు పెరగడం ఇతర సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.