క్రిమినాశక మౌత్ వాష్‌లలో క్లోరెక్సిడైన్, సెటిల్పైరిడినియం క్లోరైడ్ లేదా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే సమ్మేళనాలు ఉంటాయి. ఫ్లోరైడ్ మౌత్ వాష్‌లు ఒక వ్యక్తి దంతాల సన్నని బయటి కవచమైన ఎనామెల్‌ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. రోజుకు ఒకసారి మౌత్ వాష్ ఉపయోగించడం సురక్షితం. అయితే అంతకు మించి వాడకూడదు. అధికంగా తీసుకోవడం వల్ల రుచిలో మార్పులు , పంటి మరకలు వంటి సమస్యలు వస్తాయి.
మౌత్ వాష్ దంతాలకు మంచిదే అయినా.. ప్రతిరోజూ మౌత్ వాష్ వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ మౌత్ వాష్ వాడకాన్ని పరిమితం చేయండి. కొన్ని మౌత్ వాష్‌లలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది నోరు ఎండిపోతుందని నిపుణులు అంటున్నారు. మీకు ఏదైనా నోటి వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే దంతవైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మౌత్ వాష్ ఉపయోగించండి.