KMR: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లకు అధికారులు నియామకపత్రాలు అందజేస్తున్నారు. వర్ని మండలంలోని సైదాపూర్ తండా గ్రామానికి చెందిన బానోత్ శ్రీరామ్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం అధికారులు సర్పంచ్‌గా నియామక పత్రం అందజేశారు. బానోత్ శ్రీరామ్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.