AP: 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో PG కోర్సుల ఫీజులను ప్రభుత్వం నిర్ధరించింది. ప్రభుత్వ కోటా సీట్లకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు రూ.9లక్షలుగా ప్రకటించింది. ఈ ఏడాది 5 కళాశాలలకు 60 PG సీట్లను జాతీయ వైద్యమండలి కేటాయించింది. అయితే తార్కిక పద్ధతిన మంత్రి సత్యకుమార్ ఫీజులను సూచించారు. ఈ క్రమంలో CM చంద్రబాబు వార్షిక ఫీజులకు ఆమోదం తెలిపారు.