కృష్ణా: కంకిపాడు మండల కార్యాలయ రహదారికి ఎట్టకేలకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎంపీపీ నెర్సు రాజ్యలక్ష్మీ చొరవతో సుమారు రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు విస్తరణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు ఈ మార్గంలో ఉండటంతో నిత్యం రద్దీగా మారే ఈ రోడ్డును మెయిన్ రోడ్, గన్నవరం రహదారులకు అనుసంధానంగా వినియోగించే వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.