కోనసీమ: జిల్లా పరిధికి చెందిన తాళ్లరేవు మండలం కోరింగ గ్రామంలో విమానాశ్రయ ఏర్పాటు కొరకు తగు చర్యలు తీసుకోవాలని మరోసారి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడును కోరినట్లు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు. అలాగే విమాన ప్రయాణికుల కోసం వాటి సర్వీసులు, టికెట్ ధరలు పై దృష్టి సారించాలని మంత్రికి సూచించారన్నారు.