SRD: మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈశ్వరప్ప, మాజీ సర్పంచ్ నాగేందర్ పటేల్ తమ అనుచరులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ పాల్గొన్నారు.