NLG: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. మండల పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాలను పోలీస్ విభాగం గుర్తించింది. గురువారం మండలంలోని భైరవునిబండ, ఎన్జీ కొత్తపల్లి తదితర గ్రామాల్లో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్సైలు సైదులు, రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.