SRD: సీగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా ఛైర్మన్ వై అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. పటాన్చెరు మండలం పాశమైలారం సమీపంలోని సిగాచీ పరిశ్రమ కార్యాలయంలో గురువారం వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిది మందికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆరోపించారు.