NLG: ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభల పోస్టర్ను యూనియన్ నాయకులు నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం మాట్లాడుతూ.. రాష్ట్ర ఐదవ మహాసభలు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని తెలిపారు. 7న జరిగే బహిరంగ సభకు సంఘాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.