SDPT: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితుల, సాక్షుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు.