W.G: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంలా రూపు దాల్చిందని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ మేరకు పెనుగొండలోని గాంధీ బొమ్మల సెంటర్లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణకు మద్దతు ఇస్తున్నారన్నారు.