GNTR: ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ రమణ గురువారం తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 8 స్క్రబ్ టైఫస్ కేసులు జీజీహెచ్‌కు వచ్చాయని, ఈ వ్యాధి వల్ల ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. GGHలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.