NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో, నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్ చెలరేగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. రౌడీ షీటర్లు, గంజాయి,బెల్ట్ షాపులు, నకిలీ మద్యంతో విలయ తాండవం చేస్తున్నారన్నారు. రిమాండ్లో ఉన్న రౌడీలు జైళ్లలో రాజభోగాలు అనుభవిస్తున్నారని రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణించాయని చెప్పారు.