AP: విశాఖపట్నం బురుజుపేటలో శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి వార్షిక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.