SRPT: మునగాల మండలం, రేపాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (MRO) కఠిన చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెందిన 25 మంది ముఖ్య నాయకులను ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పూచీకత్తుపై ఈరోజు బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే పూచీకత్తు జప్తు చేయబడుతుందని ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.