AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.