Alovera Jel: అలోవెరా జెల్ రాస్తే.. జుట్టు బలంగా మారుతుందా..?
అలోవెరాలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు , స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది. విరగడం తగ్గిస్తుంది. మరి దీనిని జుట్టుకు అప్లై చేస్తే బలంగా మారుతుందా? లేదా? తెలుసుకుందాం.
Alovera Jel: జుట్టు ఆరోగ్యానికి సహజమైన పద్ధతులను ప్రయత్నించడం ఎల్లప్పుడూ మంచిది. అలోవెరా జుట్టు పెరుగుదలకు సహాయపడే ఒక పదార్ధం. అలోవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. చుండ్రు , దురద వంటి స్కాల్ప్ సంబంధిత సమస్యలన్నీ కలబంద వాడకంతో సులభంగా పరిష్కరించవచ్చు. స్కాల్ప్‌పై అధికంగా నూనె ఉత్పత్తి అయ్యే వారు ఉపయోగించగల ఉత్తమ నివారణలలో కలబంద ఒకటి. కలబంద స్కాల్ప్ మరీ పొడిబారకుండా చేస్తుంది. అలోవెరాలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో ,ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు, స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది.
విరగడం తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ , కొద్దిగా కొబ్బరి నూనెను మిక్స్ చేసి మీ తలకు పట్టించాలి. 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి. తర్వాత కడగాలి. ఈ ప్యాక్ అకాల బూడిదను పోగొట్టడంలో , జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 3 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి 3 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి మీ తలకు అప్లై చేయండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ రెండు పద్దతులను రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉండటం వల్ల.. జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.