VZM: ఎస్. కోట మండలం తిమిడి గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి దీప ధూప నైవేద్యాలు పథకం కింద నెలకు 10 వేలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. నియోజకవర్గంలో తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఈ పథకం కింద నిధులు మంజూరు చేసేందుకు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ నిధులు నేరుగా అర్చకుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.