BDK: పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పోలింగ్ సరళి, భద్రతా చర్యలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన నారావారి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.