NTR: తిరువూరు నియోజకవర్గంలో MLA vs MP వర్గాల ఆధిపత్య పోరు TDP అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. వీరి విమర్శలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు అధిష్టానం పెద్దలు మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో, CM చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకుని గట్టిగా మందలిస్తే తప్ప ఈ గొడవలు ఆగేలా లేవని నేతలు అభిప్రాయపడుతున్నారు.