SKLM: లావేరు జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి ఎమ్మెల్సీ నాగబాబును విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.