E.G: రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రాజానగరం గ్రామానికి చెందిన చెక్క కృష్ణకు వైద్య సహాయం నిమిత్తం ఎమ్మెల్యేను కోరగా, ఆయన తక్షణమే స్పందించారు. CMRF నుంచి మంజూరైన రూ.75,000 చెక్కును ఆదివారం తమ కార్యాలయంలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.