NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన 1976-77 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 48 ఏళ్ల తర్వాత తమ తోటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు చెప్పుకొచ్చారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరి కష్ట సుఖాలను మరొక్కరు అడిగి తెలుసుకున్నారు.