ప్రకాశం: గిద్దలూరు మండలం వెంగలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన లక్ష్మి పార్వతీ పెరాలసిస్‌తో బాధపడుతున్నారు. ఈ విషయం గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని లక్ష్మి పార్వతీ కుమారుడు శ్రీనివాసులుకు అందజేశారు. తమకు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.