NZB: ఆర్మూర్ పట్టణంలో దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఎన్నికల కరపత్రాలను ఆవిష్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ నెల 22న ఉ 10 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల దరఖాస్తుల పరిశీలన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 28న ఎన్నికల పోలింగ్ ఉంటుంది.