AP: రాష్ట్ర లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో అరెస్టయిన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వీరికి బెయిల్ వస్తుందా లేక జైలు జీవితం కొనసాగుతుందా అనేది ఇవాళ తేలే అవకాశం ఉంది. దీంతో అందరి చూపు ఇప్పుడు సుప్రీం తీర్పుపైనే ఉంది.