కడప ఈస్ట్ జోన్ 26వ డివిజన్లో YCP కమిటీల నియామకాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కష్టపడే వారికే పదవులు దక్కుతాయని, డివిజన్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జగనన్న 2.0 ద్వారా ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా యిచ్చారు.