BDK: కొత్తగూడెం మండలం రామవరం బేతనియ చర్చి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ హై పవర్ విద్యుత్ లైన్ స్తంభంను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కు పోయారు. స్థానికులు స్పందించి డ్రైవర్ను బయటికి తీసినట్లు సమాచారం క్లీనర్ ఇంకా లోపలే ఉన్నట్లు తెలిపారు.