EG: రాజనగరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి వైపు వెళ్తున్న రెండు బైకులను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన వారిని 108లో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. గత 10 రోజుల్లో ఈ జంక్షన్లో జరిగిన మూడు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.