సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఛాంపియన్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్గా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. రేపు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.