AKP: మునగపాకలో టిడిపి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు స్థానిక పీఏసీఎస్ ఛైర్మన్ విఎన్ నర్సింగరావు తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెంటకోట విజయ్, చైర్మన్ గా దాడి అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడిగా కే రాంప్రసాద్, వేగి రమణబాబును ఎన్నుకున్నారు.