NLR: కోవూరు పంచాయతీలోని శివాజీ నగర్ రెండో వార్డులో కాలువలకు మరమ్మత్తులు చేపట్టారు. మరమ్మత్తులు చేస్తున్న సమయంలో మంచినీటి కుళాయిలు ధ్వంసం అయ్యాయి. దీంతో మురికి నీరు కుళాయిల ద్వారా రావడంతో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీటిని తాగలేక ఇతర పనులకు ఉపయోగించలేక ఇబ్బంది పడుతున్నామని అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు.