TG: మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు పక్కన మృతదేహం కలకలం రేపింది. మృతుడిని శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌కు చెందిన శ్యామ్‌గా గుర్తించారు. శ్యామ్ వృత్తి రిత్యా ఫంక్షన్లలో వంటలు చేస్తూ జీవనం సాగించేవాడని సమాచారం. అయితే, ఎక్కడైనా చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా.. ఎవరు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.