SS: ధర్మవరంలోని సత్య సాయినగర్‌కు చెందిన రజియా అనే మహిళ ఇంటి బయట ఉండగా అకస్మాత్తుగా పంది దాడి చేసింది. ఆమె చేతి రెండు వేళ్లను కొరికడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు పందిని తరిమేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో పందులు, కుక్కల బెడద అధికమైందని ప్రజలు అంటున్నారు.