NTR: విజయవాడ లయోలా గార్డెన్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన లిటిల్ బర్డ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే వెంకట్రావు ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ఎంతో అభినందనీయమన్నారు. చిన్నారులకు నాణ్యమైన వైద్యం, నిపుణుల సేవలు అందించే దిశగా ఈ ఆసుపత్రి మైలురాయిగా నిలువాలన్నారు.