AP: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌కు సీఎం చంద్రబాబు ఈనెల 16న రానున్నారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన 6 వేల మందికి ఆయన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎంపికైన వారితోపాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 18 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు హోంమంత్రి అనిత పోలీసు అధికారులతో కలిసి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు.