BHNG: చౌటుప్పల్లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్న ప్రసాద వితరణ ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. మొగుదల సాహితీ రమేష్ గౌడ్, ఆరుట్ల సంతోష లింగస్వామి దంపతులు అన్నవితరణ దాతలుగా సహకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తూర్పునూరి నరసింహ గౌడ్, సన్నిధానం స్వాములు దాతలను సత్కరించారు.