NRML: శనివారం మలి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లాండ్ ఆర్డర్ పటిష్టంగా నిర్వహించాలన్నారు.