హీరో రోషన్, అనస్వర రాజన్ జంటగా ‘ఛాంపియన్’ మూవీ తెరకెక్కుతుంది. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఛాంపియన్ ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభం కానుంది. రేపు ట్రైలర్ విడుల కానుంది’ అని రాసుకొచ్చారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.