నిర్మల్ జిల్లాలో నేడు రెండవ విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంటాల, ఓల గ్రామాల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు, క్యూలైన్ల నిర్వహణ, సీసీటీవీ నిఘాను పరిశీలించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.